స్కూళ్లకు సెలవులు పొడిగించిన తెలంగాణ సర్కార్‌

202
scholl holidays

రాష్ట్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో స్కూళ్ల సెలవులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జూన్ 11 వరకు సెలవుల్ని పొడిగించారు. 12 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తొలుత మే 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జూన్‌ 1న పాఠశాలలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. అయితే తాజాగా ఎండల నేపథ్యంలో సెలవులను మరో 10 రోజులు పొడిగించారు.