మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తా: ఎమ్మేల్యే జగ్గారెడ్డి

32

సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రీస్తు జయంతి వేడుకలు, సీఎస్ఐ చర్చిశతాబ్ది వార్షికోత్సవ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అథితులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సీఎస్ఐ చర్చి నిర్మాణానికి బిషప్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మేల్యే జగ్గారెడ్డి.. మాట్లాడుతూ.. కరోనా కారణంగా గత రెండు సవత్సరాలుగా మనం సామూహికంగా కలుసుకోలేదు. ఈ రెండు సంవత్సరాలు చీకటి రోజులు.. ఇప్పుడు వెలుగు వచ్చింది కానీ మనం అందరం జాగ్రర్తగా ఉండాలని సూచించారు. రెండు సంత్సరాలలోపు కొత్త ప్రార్ధన మందిరం ఎర్పాటుకు కృషి చేస్తా.. నా తరపున పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. నేను మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తా.. చర్చి నిర్మణా కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తా అని హామీ ఇచ్చారు.