సేవకు ప్రతీక నర్సులు: మంత్రులు

151
nurse day
- Advertisement -

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో..నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ గౌడ్… సేవకు, మానవత్వానికి వారు ప్రతీక… నిస్వార్థ సేవ చేస్తూ ప్రతి రోగిని సొంతవారిలా చూసుకొని కోలుకునేలా చేసే నర్సులందరికి తల్లికి మరో రూపమే నర్సుగా మంత్రి అభివర్ణించారు.

కొవిడ్‌ లాంటి వంటి విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. నిత్యం రోగులకు సేవలు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని మంత్రి సత్యవతి రాథోడ్‌ కొనియాడారు. నర్సులు చేసే సేవలకు అందరం ఎంతో రుణపడి ఉన్నామనన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి సేవలను గుర్తించడమే మనం వారికి ఇచ్చే గౌరవం అన్నారు.

- Advertisement -