నర్సుల త్యాగం వెలకట్టలేనిది: సీఎం కేసీఆర్

61
kcr

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు.

అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత న‌ర్సుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న న‌ర్సులంద‌రికీ ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.