మొక్కలు నాటి భవాని స్టీల్ఏజెన్సీని ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్

147
srinivas gic
- Advertisement -

మహబూబ్ నగర్ పట్టణం లోని భగీరథ కాలనిలో నూతనంగా ఏర్పాటు చేసిన భవాని స్టీల్ & సిమెంట్ మర్చేంట్ నూతన ఏజెన్సీ ప్రారంభోత్సవ సందర్భంగా రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి తో ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటి ఏజెన్సీ ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏజెన్సీ నిర్వహకులు జి.భాను ప్రకాష్ యాదవ్ , భాస్కర్ రెడ్డి గార్లను అభినందించారు. ప్రతి ఒక్కరు ఇదే విధంగా స్ఫూర్తి పొంది మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , కిషోర్ గౌడ్ , జి.మురళి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -