కళాకారుల సంరక్షణకు కృషి- మంత్రి శ్రీనివాస్

62
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్, శ్రీ సత్యసాయి కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎ. ఆర్. కృష్ణ స్మారక నాటకోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతరించుకపోతున్న కళలను, కళాకారుల సంరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా కళాకారులకు వృధ్యాప్య పెన్షన్లు అందిస్తున్నామన్నారు. సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి కళాకారులకు ఉద్యోగాలను కల్పించామన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను ఇచ్చామన్నారు.

రాష్ట్రంలో మహనీయులను, కవులను, కళాకారులను, సాహితీ వేత్తలను గుర్తించి వారి సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు వారి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కళాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు (డిసెంబర్ 27, 28, 29 ) జరుగుతున్న ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ ఎ. ఆర్. కృష్ణ స్మారక అవార్డును హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం మాజీ అధ్యాపకులు ప్రో. BSN మూర్తికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా. KV రమణ చార్యులు, షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, మాజీ శాసన మండలి చైర్మన్ బుద్ధ ప్రసాద్, గుమ్మడి గోపాలకృష్ణ, నెహ్రూ, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -