వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంపు…

16
nani

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు మంత్రి కొడాలి నాని. తనను చంపేందుకు రెక్కీ నిర్వహంచారన్న వంగవీటి రాధ వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తెచ్చారు కొడాలి నాని.

ఈ సందర్భంగా మాట్లాడిన నాని.. వంగవీటి రాధా మా తమ్ముడు…. గుడ్లవల్లేరులో నిన్న వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ రావాలని పిలిస్తే వెళ్లా… నా సమక్షంలోనే నిన్న వంగవీటి రాధాపై రెక్కి చేశారన్నారు. రెక్కీపై సీఎంతో చర్చించాను…. రాధాకు 2+2గన్ మెన్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. రాధాకు వెంటనే భద్రత కల్పించాలని ఇంటలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో విచారించి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశింశారని… రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలన్నారు.

ఎవరికి ప్రాణ భయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆలోచనను ఉపసంహరించుకోవాలి లేదంటే ..ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వైసీపీ లోకి వస్తానని రాధా మాతో చెప్పలేదు..మేమూ ఆహ్వానించలేదన్నారు. విగ్రహాఆవిష్కరణకు పిలుస్తే మేము వెళ్లాం..దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.