ఆబ్కారి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష..

188
Minister Srinivas Goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఆబ్కారి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి, తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్ గ్రేషియా పద్ధతి క్లిష్ట తరంగ ఉండడం వలన ఆబ్కారి శాఖ అధికారులను సరళికృత, సులభతర నిబంధనలను రూపొందించి ఒక వారంలోపు ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని మంత్రి అధికారులను ఆదేశించినారు.

ఈ సమీక్షలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబోతున్న నీరా మరియు నీరా ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాలో నందనవనంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తయారీ, మరియు నిర్మాణ సంబంధిత టెండర్ ప్రక్రియ మరియు ఇతర అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో భాగంగా వీటితోపాటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్ నుండి అడిషనల్ కమీషనర్ అధికారుల పదోన్నతులపై చర్చించారు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సంవత్సరంలో అందరికీ పోస్టింగులూ, బదిలీలూ వెంటనే చేపట్టాలని, అందుకు డీపీసీ లోకి వచ్చే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆబ్కారి శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, అదనపు కమిషనర్ అజయ్ రావు, డీసీ లు ఖురేషి, అంజన్ రావు, ఏసీ హారికిషన్, ఈసీ లు దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, గణేష్ గౌడ్, రఘురాం, ప్రదీప్ రావు, శ్రీనివాస రావు, జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -