తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ , స్వీట్ ఫెస్టివల్ 2020 నిర్వహణపై రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ టూరిజం కమిషనర్ మరియు స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ టూరిజం ఉన్నత అధికారులు మహేష్ ఓం ప్రకాష్ శశిధర్ లతోపాటు స్వీట్ ఫెస్టివల్ నిర్వాహకులైన క్లిక్ (CLIC) Culture Language Indian Connection ప్రతినిధులు . లిబి బెంజిమెన్ , వీణా , .అభిజిత్ భట్టాచార్య , . కమలేష్గారు, ఆనంద్ కులకర్ణి తోపాటు kite ప్లేయర్స్ కోఆర్డినేటర్ విక్రమ్ సోలంకి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో లో గత ఐదు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో 2020 జనవరి 13 నుండి 15 వరకు నిర్వహించనున్న 5th ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ మరియు 3rd ఎడిషన్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించడానికి నిర్వాహణ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు 2020 ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెరిగేలా ఈ ఫెస్టివల్ నిర్వహించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో మాదిరిగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్శించడానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సదుపాయాలు సౌకర్యాలను కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. కైట్ ఫెస్టివల్ లో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలలో గుర్తింపు ఉన్న కైట్ క్లబ్ లను ఆహ్వానించాలని, పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ వివిధ దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానించి ఆ దేశాల యొక్క స్వీట్స్ వెరైటీలను ప్రదర్శనలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలని అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్ నగరంలో స్థిరపడి ఉన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు స్వీట్ ఫెస్టివల్ లో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రజలను చేయాలని భాగస్వామ్యం చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు తో పాటు నిర్వహణ చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లను రాష్ట్రంలో హైదరాబాద్ తో ఇతర పట్టణాలలో నిర్వయించే విధంగా తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13 నుండి 15 వరకు జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్వీట్ కైట్ ఫెస్టివల్ లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన కళా ప్రదర్శనలు తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళా ప్రదర్శనలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2020 జనవరి 13 నుంచి 15 వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ విజయవంతం అయ్యేలా అధికారులు పూర్తి సమాయత్తం గా ఉండాలని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని అందుకు తగిన ప్రచారం సంబంధించిన ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.