గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా పాలసీ..

314
srinivas goud minister
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబందిత శాఖాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, అధికారులు నాగిరెడ్డి, చంద్రశేఖర్‌లతో పాటు గీత వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు అంబాల నారాయణ, రమేష్ గౌడ్, అమరవేని నర్సాగౌడ్, అయిలి వెంకన్న, రమణ, విజయ్ కుమార్, సత్యం గౌడ్ మరియు తదితర ప్రతినిధుల బృందంతో సమావేశం నిర్వహించారు.

minister srinivas goud

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం, ఆత్మగౌరవం తీసుకరావాలని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారన్నారు. అందులో భాగంగా గీత కార్మికులకు జీవనోపాధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నీరా పాలసీని ప్రకటించారన్నారు. నీరా పాలసీలో భాగంగా రాష్ట్రంలో నీరా మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీకి సాంకేతికంగా అధ్యయనం చేయటానికి రెండు రోజుల స్టడీ టూర్‌ను రాష్ట్ర గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ నేతృత్వంలో కమిటీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

ఈ కమిటీలో అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉండి రాజమండ్రి సమీపంలోని పందిరి మామిడిలో ఉన్న డా. వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్ యూనివర్సిటీలో టాడి మరియు అలైడ్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్‌లో నీరా మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీని అధ్యయనం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

srinivas goud

నీరా మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీలో భాగంగా నీరా సేకరణ, నిల్వచేయటం, ప్యాకింగ్, స్టోర్ పాయింట్ ఏర్పాటు, మోడల్ కేంద్రాల ఏర్పాటుపై ఈ బృందం రెండు రోజుల పాటు డా.వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్ యూనివర్సిటీలో టాడి మరియు అలైడ్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్‌లో పరిశీలించి, అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

- Advertisement -