రంగారెడ్డి జిల్లా హాకీ క్రీడాకారులకు అభినందన..

233
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V.శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర హాకీ ఛాంపియన్ షిప్ లో విజయం సాధించిన రంగారెడ్డి జిల్లా జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ నెల 26 నుండి 28 వరకు తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని జింఖాన గ్రౌండ్ మైదానంలో జరిగిన 5 వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్ షిప్ లో రంగారెడ్డి జిల్లా జట్టు హైదరాబాద్ జట్టు పై విజయం సాధించి 2021 ఛాంపియన్ షిప్ ని కైవశం చేసుకున్న సందర్భంగా హాకీ క్రీడాకారులను మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ లయన్ కొండ విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోశాధికారి పాండురంగా రెడ్డి, కోచ్ మధు, మేనేజర్ నీలేష్ , క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -