హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “నీరా కేఫ్” నిర్మాణ పనులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించి రాష్ట్రంలో ఉన్న గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నాని తెలిపారు. ప్రజల ఆరోగ్య ప్రదాయిని నీరా, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాల కేంద్రం’ నీరా కేఫ్ ‘ను రూపొందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయాలని కోరారు. వచ్చే నవంబర్ లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.వీటితోపాటు యాదాద్రి – భువనగిరి జిల్లాలోని నందన వనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యాయన కేంద్రం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్ననీరా కేఫ్ నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు.