మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట విషాదం..

148
- Advertisement -

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కాగా, శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌ రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మంత్రి తల్లిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.మంత్రి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -