బుద్ధవనం ప్రాజెక్టును టూరిజంగా మారుస్తాం

233
Minister Srinivas Goud

బుద్ధవనం ప్రాజెక్టును టూరిజం ప్రాంతంగా మారుస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ బుద్ద సంగిటి 2019 సెమినార్ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ ఎం.డి & టూరిజం కమిషనర్ దినకర్ బాబు , టీఎస్ టీడీసీ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి , బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బుద్ధ ప్రాజెక్టు లో బుద్దునికి సంబంధించిన చరిత్ర అనవాళ్ళను అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బుద్ద ప్రాజెక్టు కోసం 2.74 ఎకరాల స్థలాన్ని కేటాయించాము . మిగతా దేశాలలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం లోన కూడా బుద్ధుని ఆనవాళ్లు ఉన్నాయి. బుద్ధుడు కన్నా కలలు ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా బుద్ధవనం ప్రాజెక్టు ను ప్రారంభిస్తామని చెప్పారు.

Minister Srinivas Goud Attend telangana Budda Sangati 2019 Seminar