ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన

336

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తోంది. సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర రమణ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ వరంగల్ రూరల్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరిత 6 మొక్కలను నాటారు.

సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొదలు 3 మొక్కలను నాటిన తరవాత జిల్లా కలెక్టర్ హరిత గారు మరో ముగ్గురికి నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,సీపీ రవీందర్‌కు ఛాలెంజ్‌ని విసిరారు.

ఆ తరువాత భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలను నాటి మరో ముగ్గురికి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మ రెడ్డి,జనగామ కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి గార్లకు గ్రీన్ ఛాలెంజ్ ను ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా మున్సిపల్ కమిషనర్ జి వేణు గోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించారు వనపర్తి కమిషనర్ రజినీకాంత్ రెడ్డి .మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని కొత్తగూడెం , సిద్దిపేట ,సిరిసిల్లా జిల్లాలో మున్సిపల్ కమిషనర్ లను మొక్కలు నాటాలని నామినేట్ చేశారు .

Huge Response for mp santhosh green challenge….Huge Response for mp santhosh green challenge

green challenge green challenge green challenge green challenge