టీఎస్‌ఐపాస్‌తో పర్యాటక శాఖ సేవలు

155
srinivas goud
- Advertisement -

టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్లో పర్యాటక శాఖ సేవలను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనుసంధానం ద్వారా పర్యాటక శాఖలో ప్రారంభం కానున్న సింగిల్ విండో అనుమతుల ప్రక్రియ. దీని ద్వారా అత్యంత సులభతరం కానున్న హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీ, ఈవెంట్స్ అనుమతులు, రెన్యువల్ ప్రక్రియ .

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్…పర్యాటకం లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం గొప్ప విషయం…జపాన్ తదితర చాలా దేశాలు పర్యాటకం మీదనే బతుకుతున్నాయని తెలిపారు.తెలంగాణకు చాలా పర్యాటక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.హోటల్ కట్టాలంటే 15 రకాల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

30 రోజులలో అనుమతులు ఇవ్వనున్నాం…. రెన్యువల్ కూడా ఆటోమాటిక్ గా జరుగుతుందన్నారు.అనుమతి ఇవ్వని పక్షంలో 30 రోజుల తర్వాత డీమ్డ్ అప్రూవల్ వస్తుందన్నారు.భవిష్యత్లో తెలంగాణలో టూరిజం మంచి అభివృద్ధి చెందుతుంది.…తెలంగాణ కు ఘనమైన చరిత్ర ఉందన్నారు.

రామప్ప లాంటి వరల్డ్ టూరిజం మ్యాప్ లోకి చేరుతాయన్నారు.డ్యామ్ ల వద్ద పర్యాటకం అభవృద్ది చేస్తాం…..భారతదేశంలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోందన్నారు.హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -