పీవీకి భారతరత్న ఇవ్వాలి: మంత్రులు గంగుల,శ్రీనివాస్‌గౌడ్

112
gangula

పీవీ నరసింహరావుకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్. పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానం సందర్భంగా మాట్లాడిన గంగుల…తెలంగాణ గ‌డ్డ మీద పుట్టిన పీవీ ఏ అన్యాయాన్ని స‌హించ‌లేదన్నారు.ప‌ట్వారీ నుంచి ప్ర‌ధాని వ‌రకు పీవీ అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చి దేశానికే వ‌న్నె తెచ్చారు. అలాంటి తెలంగాణ ముద్దుబిడ్డ‌కు దేశంలో స‌రైన గౌరవం ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తుందన్నారు.

పీవీతో త‌న‌కు చాలా అనుబంధం ఉంది. తాను ఇంజినీరింగ్ చ‌దివేట‌ప్పుడు 1984లో ఆయ‌న ఎంపీగా ఉన్నారు. త‌న‌కు ఇంజినీరింగ్ సీటు ఇవ్వాల‌ని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి పీవీ ఓ చిటీ మీద రాసిచ్చారని గుర్తుచేశారు మంత్రి గంగుల కమలాకర్‌. పీవీ వ‌ల్ల‌ త‌న ఇంజినీరింగ్ విద్య పూర్త‌యింది…సాగునీటి రంగంలో పీవీ క‌న్న క‌ల‌ల‌ను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని చెప్పారు.

పీవీని ప్ర‌పంచ దేశాలు గౌర‌వించాయి. కానీ దేశంలో మాత్రం పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల హృద‌యాల్లోఉందన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఈనాటి త‌రానికి పీవీ సంస్క‌ర‌ణ‌లు, మాన‌వీయ కోణం అంద‌రికీ తెలియాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాది పాటు నిర్వ‌హించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.