రాష్ట్రంలో నీరా ప్లాంట్: శ్రీనివాస్ గౌడ్

180
srinivas goud

అబ్కారీ శాఖ మంత్రివర్యులు డా. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రములో నీరా ప్రాజెక్టు మీద సమీక్ష సమావేశం జరిపారు. తాటి, ఈత చెట్ల నుండి నీరాను ఏ విధముగా కలెక్షన్ చేయాలి మరియు ఉష్ణోగ్రతను స్థీరీకరిస్తూ చెట్ల నుండి కలెక్షన్ పాయింట్ మరియు నీరా తయారీ కేంద్రం వరకు రవాణా చేసి నీరా ప్యాకింగ్ చేసి పెట్ బాటిల్ మరియు బాటిళ్లలో నీరా కేంద్రం ద్వారా నీరా అమ్మకాలు ఏ విధంగా చేయాలో చర్చించడం జరిగింది.

ఈ ప్రాసెస్ లో భాగంగా పెర్మనెంట్ నీరా ప్యాకింగ్ ప్లాంట్ మరియు తాత్కాలిక హూమిడిఫైయర్ నీరా ప్యాకింగ్ ప్లాంట్ నిర్మాణము గురించి చర్చించడం జరిగింది. CPCRI, కేరళ టెక్నాలజి ఉపయోగిస్తూ త్వరలో రాష్ట్రములో నీరాను ప్రారంబించుటకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

త్వరలో 4 కేంద్రాలలో ట్యాపర్లకు శిక్షణ ఇచ్చి త్వరగా నీరా కలెక్షన్ ప్రారంభించాలని తెలిపినారు. నీరా ప్లాంట్ కై అంచనా వ్యయం తయారు చేయాలని, నీరా బాటిల్ డిజైన్ మరియు నీరాకీ మంచి పేరు సూచించాలని శాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ , GHMC పరిధిలోని రిసార్టులు, పార్కులు మరియు ఇతర ప్రదేశాలలో పెంచివున్న గిరాకతాళ్ళ వివరాలు సేకరించాలని ఈ సంధర్భంగా మంత్రి గారు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమములో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, శ్రీ. సర్ఫరాజ్ అహ్మెద్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ. అజయ్ రావు గారు, అసిస్టెంట్ కమిషనర్ జె. హరికిషన్, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ విష్ణుస్వరూప్ రెడ్డి మరియు ఎక్సైజ్ సూపరిండెంట్లు హెచ్.దత్తురాజ్ గౌడ్, A. చంద్రయ్య, కె. గణేశ్ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ జనార్ధన్ , సైంటిస్టు KR సురేశ్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.