సెప్టెంబర్ 1 నుండి ఆన్‌లైన్ క్లాసులు..

211
telangana online classes

సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు.

డిజిటల్, టీవీ, టీశాట్‌ వంటి నెట్‌వర్క్‌ ఛానల్‌ ప్లాట్‌ఫాంల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబడతాయి. ఈ-లెర్నింగ్, దూర విద్యలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు 27.08.2020 నుండి క్రమంగా పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.