అఫిడవిట్‌పై అనవసర రాద్దాంతం: శ్రీనివాస్ గౌడ్

58
srinivas goud

ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ తో పాటు ఒకరిద్దరు రండలు తన అఫిడవిట్‌పై లుచ్చా నాటకం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్‌..తన ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర రాద్ధాంతం చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

త్వరలో వాళ్ళ పేర్లు ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. గతంలో లుచ్చా నా కొడుకులు ఓటరు జాబితా నుంచి నా ఓటు తీయించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాను నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు నన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బి ఫార్మ్‌తో పాటు ఇచ్చిన అఫిడవిట్‌ మాత్రమే ఫైనల్ అన్నారు.

వెహికిల్ చాలన్ కట్టలేదని కేసు పెడితే ఎలక్షన్‌లో ఎవ్వరూ మిగలరన్నారు. నా అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేస్తే…విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిందన్నారు.