పంటలు పోటెత్తుతాయ్- మంత్రి నిరంజన్ రెడ్డి

573
Minister Niranjan Reddy
- Advertisement -

రాష్ట్రంలోని సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతన్నలకు సాగు నీటి కష్టాలకు తీరిపోయాయి. కాళేశ్వరం నుండి అందుతున్న నీరుతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు,చెరువులు నీటి నిండుకుండను తలపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ సారి రాష్ట్రంలో సమృద్దిగా పంటలు పండుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులు తమ పంటను అమ్ముకునే విషయంలో ఎలాంటి ఇప్పందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అదేశాలు ఇచ్చారు.

ఈ సంద్భంగా మంత్రి పత్రికా ప్రకటన చేశారు. మద్దతు ధర కోసం మార్కెట్లు నిండిపోతాయి.క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలిమార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ కేంద్రాలు ముందుగానే పరిశీలించి ఏర్పాట్లు సరిగ్గా ఉన్నది లేనిది పరిశీలించుకోవాలి. ప్రభుత్వం ఇంతకుముందు జారీచేసిన చెక్ లిస్ట్ లతో సరిచూసుకుని ఏవయినా ఏర్పాట్లు తక్కువగా ఉంటే యుద్దప్రాతిపదికన సరిచేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

niranjan reddy

కలెక్టర్ల అనుమతితో పత్తి కొనుగోలుకు సంబంధించి సాధ్యమైనంత ఎక్కువగా జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలి. కావాల్సిన సాంకేతిక సౌకర్యాలు, వే బ్రిడ్జ్ లను ఏర్పాటు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా రైతులు వరసక్రమంలో వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. అవసరం అయితే ముందస్తుగా రైతులకు టోకెన్లు జారీచేయాలి. వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి వారి విధులు, బాధ్యతలను అప్పగిస్తూ తగిన ఉత్తర్వులు అందజేయాలి. దాని మూలంగా తరువాత జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారు.

కొనుగోలు కేంద్రాలలో సంబంధిత సిబ్బంది రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. కరెంటు సంబంధిత ఇబ్బందులు ఏర్పడినప్పుడు వెంటనే సరిచేసేందుకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.రైతులు, సిబ్బందికి మార్కెట్ యార్డులలో తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి.అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

మార్కెట్లకు వచ్చిన ధాన్యం అకాలవర్షాలకు నష్టపో్కుండా తగిన సదుపాలను ఏర్పాటు చేయాలి. టార్పాలిన్లు, లాంతర్లు, టార్చ్ లైట్లు తదితర పరికరాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. అక్కడక్కడా కొందరు దళారులు, వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడితే వెంటనే చట్టపరమయిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతుధర తెలిపే బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఈ విషయం రైతులకు తెలిసేలా వివిధ పద్దతుల ద్వారా ప్రచారం చేపట్టాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు,ఆయా శాఖల జిల్లా అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -