మానస కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి

605
manasa
- Advertisement -

వరంగల్ లో మానస అనే ఇంటర్ విద్యార్ధి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈహత్యకు కారణమైన నిందితుడిని పట్టుకుని రిమాండ్ తరలించారు పోలీసులు. అయితే నేడు మానస కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి సత్యవతి రాధోడ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. మానస స్వగ్రామమైన గీసుగొండ మండలం కొమ్మాల వెళ్లి కుటుంబసభ్యులను మంత్రి,ఎమ్మెల్యే పరామర్శించారు.

మాసన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మానస కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. జి.ఓ.21 ప్రకారం మాసన కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.50000/- అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మంత్రి హామి ఇచ్చారు. నిందితుడినికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. మానస కుటుంబానికి అన్నీ విధాల అండగా ఉంటామని చెప్పారు మంత్రి.

- Advertisement -