రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి- మంత్రి

42
minister allola

రైతు సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి చైర్మన్ ఈశ్వర్‌ను, కమిషనర్ బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను మంత్రి అందజేశారు. (50 % రాయితీపై బేలర్, గడ్డి కట్టే యంత్రం, రోటావేటర్లు, తైవాన్ పంపులు, పంప్ సెట్లు) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.