తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఆకుల లలిత రాఘవేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు అని తెలిపారు. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా పెద్ద బాధ్యతను అప్పగించారని మహిళా సాధికారత కొరకు వారి అభ్యున్నతి కొరకు సాటి మహిళగా నేను చాలా కృషి చేయవలసి ఉందని దీని కోసం అహర్నిశలు కృషి చేస్తానని లలిత అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి పది జిల్లాల్లోనూ అమలు అవుతున్నందున రాబోయే రోజులలో దీనిని 33 జిల్లాల మహిళా అభ్యున్నతి కోసం విస్తరించి తప్పకుండా దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆకుల లలిత రాజకీయాలలో చాలా అనుభవం ఉన్నవారు అని చాలా పదవులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఈ పదవి చేపట్టినందుకు ఆకుల లలితకి శుభాభినందనలు అని తెలిపారు. ఇప్పుడు చేపట్టిన పదవి చాలా బాధ్యతగల పదవి అని.. దీని మహిళా సాధికారతకు అభ్యున్నతి కొరకు తప్పకుండా కృషి చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళల పట్ల చాలా ముందు చూపు ఉంది. మహిళల సంక్షేమం కొరకు కృషి చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి. మహిళల భద్రత పట్ల రక్షణ పట్ల వారి భవిష్యత్తు కొరకు చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. దానికి నిదర్శనమే రాష్ట్రంలో మహిళల కొరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు వారి సంక్షేమం కోసం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారని.. ముఖ్యమంత్రి ఆలోచనల్లో ముఖ్యంగా ఉంది అని తెలిపారు. మహిళల విషయాల్లో చాలా ముందుచూపుతో ఆలోచిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.