కరోనాను జయించిన క్రాక్‌..!

156
krack
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం “క్రాక్”. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

దాదాపు 9 నెలల తర్వాత ఒక బడా హీరో నటించిన సినిమా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల కాగా సంక్రాంతి రేసులో మొనగాడుగా నిలిచాడు రవితేజ. తొలి షో నుండే పాజిటివ్ టాక్‌ రావడంతో మంచి వసూళ్లను రాబట్టింది. విడుదలైన 5 రోజుల్లోనే లాభాల్లకి వచ్చేసింది.

పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటనకు తోడు.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం.. గోపిచంద్ మలినేని టేకింగ్.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. రామ్ లక్షణ్ ఫైట్స్‌ ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించాయి.

- Advertisement -