మేడారం జాతరపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష..

669
satyavathi rathod
- Advertisement -

మేడారం జాతరపై మాసబ్ ట్యాంక్ డీ ఎస్ ఎస్ భవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్, రోడ్లు భవనాలు, గిరిజన, ఫారెస్ట్, పంచాయితీ రాజ్ అధికారులతో జాతరపై మంత్రి రాథోడ్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో మేడారం జాతర జరగనుంది. ఈ జాతరలో భాగంగా వరంగల్ జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించాం. దేశంలో ఉన్న గిరిజన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు.

మేడారం జాతర కోసం ఈ సారి సీఎం కేసీఆర్ 75 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతిసారి లాగే ఈ సారీ జాతరను దిగ్విజయంగా నిర్వహిస్తాం. జాతర కోసం డిసెంబర్ చివరి వరకు మేడారంలో ఏర్పాట్లు పూర్తి చేస్తాం. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూనే జాతరను నిర్వహించాలని నిర్ణయించాం. త్వరలోనే డిల్లీకి వెళ్లి మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాము. గిరిజనుల సంప్రదాయాలకు భంగం కలగాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

- Advertisement -