గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్..

170
Minister Satyavathi
- Advertisement -

మంత్రి సత్యవతి నేడు రాథోడ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని మంత్రిని కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో కోడళ్ళు సోనమ్ రాథోడ్, బిందు రాథోడ్, మనుమరాళ్లు కియరా రాథోడ్, ఆధ్యా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ జమ్మి, మామిడి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

- Advertisement -