బిగ్ బాస్ 5: హౌజ్‌మేట్స్‌తో ఆటాడుకున్న నాగ్‌..

98
nag

బిగ్‌ బాస్‌ 5 సీజన్‌ వారం వారం రసవత్తరంగా మారుతోంది. శ‌నివారం హౌజ్‌లో నాగార్జున చాలా సీరియ‌స్‌గా క‌నిపించారు. హౌజ్‌మేట్స్ ని ఓ ఆట ఆడుకున్న నాగార్జున ఆ త‌ర్వాత వైకుంఠ‌పాళి గేమ్ ఆడించాడు. అనంతంరం ‘మెడ‌లో మోత‌- స‌రిపోయే సామెత’ గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్‌ సామెతలు చెప్తే దానికి సంబంధించిన‌ ప్లేట్‌ను ఎవ‌రికి సూటవుతుందో వారి మెడ‌లో వేయాల‌న్నాడు. అందుకు కార‌ణం కూడా చెప్పాల‌ని అన్నాడు.

ముందుగా గేమ్‌ని సన్నీ మొద‌లు పెట్టగా, కుక్క తోక వంక‌ర సామెత ఉన్న ప్లేట్ బోర్డ్ తీసుకెళ్లి జెస్సీకి అంకిత‌మిచ్చాడు. మాన‌స్‌.. అబ‌ద్ధం ఆడినా అతికిన‌ట్లు ఉండాల‌ని ర‌వికి సూచించాడు. కాజ‌ల్‌.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి ప‌డుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్ట‌వుతుంద‌ని చెప్పింది. యానీ.. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్న‌దాన్ని కాజ‌ల్‌కు ఇచ్చింది. ప్రియాంక‌.. కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీట‌కు ఎందుకు అన్న సామెత‌ను సిరికి ఇచ్చింది.

శ్రీరామ్‌.. అంతంత కోడికి అద్ద‌సేరు మ‌సాలా సామెత కాజ‌ల్‌కు సూట‌వుతుంద‌న్నాడు. విశ్వ‌.. దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు సామెత లోబోకు సెట్ట‌వుతుంద‌న్నాడు. జెస్సీ.. పైన ప‌టారం, లోన లొటారం అన్న ప్లేటును స‌న్నీకిచ్చాడు. సిరి.. అంద‌ని ద్రాక్ష ప‌ళ్లు పుల్ల‌న అన్న‌ ప్లేటును ష‌ణ్ను మెడ‌లో వేసింది. ష‌ణ్ను.. ఏకులా వ‌చ్చి మేకులా త‌గులుకున్నాడ‌ని ర‌వి గురించి అభిప్రాయ‌ప‌డ్డాడు.

ర‌వి.. ఓడ ఎక్కేవ‌ర‌కు ఓడ మ‌ల్ల‌న్న‌, ఓడ దిగిన త‌ర్వాత బోడ మ‌ల్ల‌న్న అనేది మాన‌స్‌కు స‌రిపోతుంద‌న్నాడు. లోబో.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం లాభం అన్న సామెత‌ను యానీకి అంకిత‌మిచ్చాడు. ఇక ఈ రోజు దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్ కాగా, ఈ కార్య‌క్ర‌మంలో శ్రియ‌, సుమ‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు సంద‌డి చేయ‌నున్నారు. ఆరు గంట‌ల‌కు ఎపిసోడ్ మొద‌లు కానుంది.

ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి వరుస క్రమంలో సరయు.. ఉమా దేవి.. లహరి.. నటరాజ్ మాస్టర్.. హమీదా.. శ్వేత మరియు ప్రియాలు ఎలిమినేట్ అవ్వగా.. ఈవారం లోబో ఎలిమినేట్ కాబోగున్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులు తగ్గుతున్నాకొద్ది ఆట మరింత రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.