తెలంగాణలో రైతును రాజుగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. నేడు మహాబూబాబాద్ లో పర్యటించారు మంత్రి సత్యవతి. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రజలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు. రైతుల జీవితం బాగుండాలని సీఎం కేసీఆర్ ప్రతిక్షణం కోరుకుంటారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అల్లాడిపోతుంటే రైతులకు ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ సమయంలో కూడా రైతుపండించిన ప్రతి పంటను కొనుగొలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఎప్పడు ఎదో ఒక సమస్యను ముందు వేసుకుని రాజకీయం చేస్తాయన్నారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. మాహబూబాబాద్ జలాల్లో 700 కిలోమిటీర్ల పరిధిలో ఉన్న కాలువల్లో ఎప్పుడు నీరు పారె విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో రైతులు రోడ్ల మీద పంటలను అరబోయకుండా 3000 కల్లాలను త్వరలో నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.