విద్యార్థులకు పౌష్టికాహారం..మొదటిస్థానంలో తెలంగాణ

618
sathyavathi rathod
- Advertisement -

విద్యార్థులకు పౌష్టికాహారం అందిచడంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యార్థులకు మద్యహన్న భోజనం అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్ ను పరిశీలించి,బియ్యం శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు సత్యవతి రాథోడ్.

దేశవ్యాప్తంగా అక్షయ పాత్రకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని తెలిపారు సత్యవతి. కంది కేంద్రంలోని మెగా కిచెన్ ద్వారా లక్షా 24వేల మంది విద్యార్థులకు మధ్యాహ భోజనం అందించడం గొప్ప విషయం అన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు చల్లగా అయినా భోజనం వెళ్తుందని ఫిర్యాదులు వచ్చాయని… దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ సమీక్ష చేసి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

గతంలో అంగన్ వాడి లకు అందించే పిండి పదార్థాలు నాణ్యంగా ఉండేవి కాదన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను సమీక్షలు చేయడమే ప్రణాళిక సంఘం బాధ్యత అన్నారు వినోద్ కుమార్. అక్షయ పాత్ర అందించే భోజనం.. ఇంటి భోజనం కన్నా ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 25వేల నుంచి 30 వేల మందికి భోజనం అందించేలా మరిన్ని వంటశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.

- Advertisement -