ఆలయాలకు పూర్వ వైభవం: మంత్రి సత్యవతి

163
sathyavathi rathod
- Advertisement -

గత పాలకుల హయాంలో యాదాద్రి నిరాదరణకు గురైందని….సీఎం కేసీఆర్ వచ్చాక ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్…ముఖ్యమంత్రి కేసీఆరే నిజమైన హిందువని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు సీఎం కేసీఆర్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో యాదాద్రి ఆలయాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా పాలించడానికి సీఎం కేసీఆర్‌కు మరింత శక్తి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు.యాదాద్రిని మరో తిరుపతిగా తీర్చిదిద్ధడానికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతకముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు ఘనస్వాగతం పలికి , స్వామి ఆశీర్వచనం అందజేశారు.

- Advertisement -