బతుకమ్మ చీరలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగులోని గట్టమ్మ ఆలయంలో, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మలకు దర్శించుకుని అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి…దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని…మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.339 కోట్లు వెచ్చిస్తుందని….10 రంగులు 18 డిజైన్లలో 200 రకాల చీరలను ఆడబిడ్డలకు అందిస్తున్నామని తెలిపారు.
దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టడానికి కేంద్రం కంకణం కట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.