గిరిజన రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: సత్యవతి

43
sathyavathi
- Advertisement -

గిరిజన రిజర్వేషన్లపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సత్యవతి….గిరిజనుల రిజర్వేషన్‌లపై చెల్లప్ప కమిషన్ ని 2015 లో ఏర్పాటు చేసిన గొప్ప సీఎం కేసీఆర్. 2016లో చెల్లప్ప కమిషన్ గిరిజన రిజర్వేషన్లు 10 శాతం ఉండాలని నివేదికను అందజేసిందన్నారు.

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర తుడు అబద్ధాల పుట్ట…..అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన రిజర్వేషన్లపై డ్రామాలు ఆడే నాయకులకు గిరిజనులు త్వరలో బుద్ధి చెపుతారు. మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించమంటే కేంద్రం పట్టించుకోకుండా గిరిజనులను అవమనిస్తుందన్నారు.

2017లో అసెంబ్లీలో 10 శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అసెంబ్లీలో ఆమోదించిందన్నారు. 2019 లో సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు పీఎం నరేంద్ర మోదీని కలిసి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. నేడు కేంద్ర బీజేపీ నాయకులు గిరిజన రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్రం పట్ల అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -