గాడ్ ఫాదర్‌…కీ అప్‌డేట్

62
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా `గాడ్ ఫాదర్’ ను ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు. న‌య‌న‌తార పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండ‌నుంది.

ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ – సల్మాన్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షెడ్యూల్ పూర్తైనట్టు దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

- Advertisement -