- Advertisement -
ఆదిమ గిరిజన సంక్షేమ సలహా కమిటీ, ఉట్నూరు(ఐటిడిఏ)కు చైర్మన్ గా నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న ఆదివాసి ముద్దుబిడ్డ శ్రీ కనక లక్కేరావు గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ నమ్మకంతో ఈ నియామకం చేశారో, ఆ నమ్మకం నిలబెట్టే విధంగా, ఆదివాసీల అభ్యున్నతికి పాల్పడే విధంగా పనిచేయాలని ఆశించారు. ఆదివాసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి సమర్థవంతంగా చేరవేయాలన్నారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
- Advertisement -