‘ఆచార్య’కు ఘన స్వాగతం పలికిన మెగా ఫ్యాన్స్‌..

29
Megastar

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌. రామ్ చ‌ర‌ణ్ సిద్ధ అనే పాత్ర‌లో విద్యార్ధి నాయ‌కుడి పాత్ర‌లో నటిస్తున్నడు. మే 13న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ రాజమండ్రిలో జరగనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు మెగాస్టార్‌. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ చిరంజీవికి అపూర్వస్వాగతం పలికారు.

మధురపూడి ఎయిర్ పోర్టు ప్రాంతమంతా మెగా అభిమానులతో నిండిపోయింది. అంతేకాదు, విమానాశ్రయం నుంచి షూటింగ్ జరుగుతున్న కోరుకొండ, మారేడుమిల్లి వరకు చిరంజీవిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. చిరంజీవిపై పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు చిరంజీవి ముగ్ధుడయ్యారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.