బర్త్ డే….మొక్కలు నాటిన సబితా,ఎర్రోళ్ల

132
srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ పుట్టినరోజు సందర్భంగా వారి వారి నివాసాల్లో మొక్కలు నాటారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, SC ST కమీషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ర మాట్లాడుతూ ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మా మనవరాళ్లతో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని మొక్కలు పెంచడం వల్ల భవిష్యత్ తరాలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మా మనవరాళ్లకు వివరించడం జరిగిందని. భవిష్యత్తులో మీరు ఇదేవిధంగా మొక్కలు నాటాలని వారికి సూచించడం జరిగిందని తెలియజేశారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని వారికి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారని నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో అందరూ కూడా ఇదే విధంగా పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇరువురు తమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -