ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలను రాజ్ భవన్ కార్యాలయం మానుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు రాజ్ భవన్‌కు రావాలని యూజీసీ, విద్యాశాఖలకు గవర్నర్ లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదున్నారు.
లీకులు, తప్పుడు వార్తలతో గవర్నర్ కార్యాలయం ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు మానుకోవాలన్నారు. గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకూ తనకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని చెప్పారు.
ఇక నిజాం కాలేజీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై స్పందించారు సబితా. రేపు ఉదయం నిజాం కాలేజీ హాస్టల్ సమస్యపై ఉన్నత విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. అధికారులతో చర్చించిన అనంతరం నిజాం కాలేజీ వ్యవహారంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..