కరోనా వ్యాప్తిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష..

195
sabita

కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, మీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ యాదయ్య, మరియు పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా లాక్డౌన్ నిర్వహించడంతో నిత్యావసర సరుకులకు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిసి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్లో కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి ఏర్పాటు చేసిన పేదలకు ఉచితంగా 10 కిలోల సన్నబియ్యం మరియు గుడ్లు పంపిణీ చేశారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. త్వరలోనే కరోన మహమ్మరిని మన దేశం,రాష్ట్రం నుండి తరిమికొడుతం అనే నమ్మకం ఉన్నది. కఠిన స్వీయ నియంత్రణ తోపాటు సోషల్ డిస్టెన్స్ ను పాటించడం ద్వారా కరోనాపై సంపూర్ణ విజయం సాధించ వచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.