కర్ఫ్యూ అమలులో కరీంనగర్ పోలీసులు సఫలీకృతం..

127
karimnagar

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అర్ధరాత్రి కూడా లాక్ డౌన్, కర్ఫ్యూ అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిఇస్తున్నారు. పటిష్టంగా అమలు అవుతున్న పెట్రోలింగ్,పికెట్స్,చెక్ పోస్ట్‌ల వద్ద అమలవుతున్న పోలీసుల పహారా, డ్రోన్ కెమెరాలు, నూతనంగా కమిషనరేట్ సమకూరిన కమాండ్ కంట్రోల్ వాహనాల యూ వినియోగిస్తూ కర్ఫ్యూ అమలు చేయడంలో సఫలీకృతం అవుతున్నారు.

చిన్న చిన్న వాడలలో గుంపులు గుంపులుగా ఉంటున్న జనాలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి సదరు ప్రాంతాలకు ప్రత్యేక సిబ్బందిని పంపిస్తూ వారిని అక్కడి నుండి చెదరగొడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను, నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అన్ని వర్గాలకు చెందిన ప్రజలపై ఉందనీ ఓ వైపు కలెక్టర్ మరో వైపు సిపి తిరుగుతూ ప్రజలకు చెబుతున్నారు. సాయంత్రం 7 గంటల నుండి కర్ఫ్యూ అమలవుతున్న ప్రాంతాలను పరిశీలిఇస్తున్నారు.

ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిఇస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పటిష్టంగా అమలవుతున్న లాక్ డౌన్, పెట్రోలింగ్ ల నిర్వాహణ, చెక్ పోస్టులు, పికెట్లు, బందోబస్తు విధుల్లో పోలీసులు పగలు రాత్రి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.