సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చికున్‌గున్యా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఆదివారం ఈ క్యాంపెయిన్‌ను అర్.కె.పురం డివిజన్లలో నీ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలనుకునే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ను క్యాంపెయిన్‌లో భాగస్వాములను చేయాలన్నారు. నిలిచిన నీటిని పారబోయాలని, దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శానిటేషన్ విషయంలో రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ చర్యల్లో ముందుండి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం అందరి కనీస బాధ్యత అన్నారు. కరోనాతో మరికొంత కాలం కలిసి బతకాల్సిందేనని, వైరస్‌వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని సూచించా రు.
మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. విశాఖ ప్రమాద ఘటన దృష్ట్యా పరిశ్రమల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పెంపుపై అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు.