దించిన తల ఎత్తకుండా చదవండి- మంత్రి హరీశ్

524
Minister Harish Rao Calls On Youth
- Advertisement -

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామ ఆనంతమ్మ కుంట కాళేశ్వరం జలాలతో నిండి, మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి జల హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామంలోని మాంకాలమ్మ, పెద్దమ్మ, మాతమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాలకు ఆవుపాలతో క్షీరాభిషేకం, గోదావరి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. విఠలాపూర్ గ్రామస్తులందరి కళ్లలో సంతోషం. మీ ముఖాల్లో చిరునవ్వు చూసి తృప్తిగా కడుపు నిండా భోజనం చేసినట్లు ఉంది. ఒకప్పుడు తాగడానికి నీళ్లు కావాలని బిందెలు అడ్డం పెట్టిన విఠలాపూర్‌లో ఇవాళ ఇంత మండు టెండల్లో అంతకమ్మ కుంట మత్తడి దూకడం చూసి, ఈ చెరువు నిండగా ఎప్పుడూ చూడలేదని.. గ్రామస్తులంటే.. ఇక నుంచి ఎండి పోవడం కూడా చూడరని చెబితే.. గ్రామస్తులు సంబురాన్ని వ్యక్తం చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కష్టకాలంలో కూడా విఠలాపూర్ లో 7643 ధాన్యం పండిందని, రూ.1.35 కోట్లు ధాన్యం కొనుగోళ్లు జరిగాయని మంత్రి వెల్లడించారు. విఠలాపూర్, చిన్నకోడూర్ మండల వాసులు ఏ విషయంలోనైనా ఆదర్శంగా ఉంటారని.. ఇదే స్ఫూర్తితో జిల్లాకు, రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని, ఇందుకు యువత సహకారాన్ని అందించాలని మంత్రి కోరారు. మీ కాళ్లకు మట్టి అంటకుండా గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం నా బాధ్యత నేను చేయిస్తానని.. కానీ గ్రామ యువత బాగా చదివి.. మంచి ఉద్యోగం పొందాలని, లేదంటే.. అమ్మ,బాపుతో కలిసి బాయికాడికొచ్చి కమర్షియల్ క్రాప్స్ పండించి మంచి లాభాలు గడించాలని గ్రామ యువతకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.

సీజన్ పంటలు పండించాలని, సన్న రకం వడ్లు, అల్లం, మిర్చి, కూరగాయల పంటలు పండించండి. మండలంలోని అన్నీ గ్రామాల్లో కుంటలు, చెక్ డ్యాములు, చెరువులు నింపుతామని మంత్రి స్పష్టం చేశారు.గ్రామంలో గోదాము నిర్మాణానికి రూ.5 కోట్లు, ఆనంతమ్మ కుంట కట్ట బలోపేతానికి మరమ్మత్తుకు రూ.1.38 కోట్లు, స్మశాన వాటికకు రూ.30 లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.40 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు.

జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. గ్రామానికి కాళేశ్వరం కాల్వల ద్వారా వచ్చిన గోదారమ్మ తల్లికి బోనాలతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతే రాజు అనే సామెతను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. సిద్ధిపేట వాసులందరికీ ఇక నుంచి మంచి రోజులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం తేవడంతో పాటుగా మన ప్రాంతానికి కాళేశ్వరం జలాలు అందించిన సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

https://twitter.com/trsharish/status/1259454890243321857

- Advertisement -