రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌..

459
Minister Sabitha Indra Reddy
- Advertisement -

వికారాబాద్ : తుంకుమెట్ల గ్రామంలో బొమ్మరాసిపేట మండల రైతు వేదిక నూతన భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అనంతరం కోడంగల్‌లో ఆగ్రో ఫెర్టిలైజర్ దుకాణం ప్రారంభించారు. అలాగే నియోజకవర్గ స్థాయి వానకాలం- 2020 పంటల సాగుపై అవగాహన సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముక్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జేడీ గోపాల్, ఆర్డీవో వేణుమాధవ్. భారీగా రైతులు హాజరైయ్యారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మొదటి రైతు వేదికను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంది. రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా, రైతుకు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. ఏ సమావేశంలో నైనా రైతుల గురించి మాట్లాడేది సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాకుండా పండుగలా మారేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తూ, పటిష్టమైన వ్యవస్థ, విధానం ఏర్పాటు చేస్తున్నారు.
కరోనా కట్టడి, రైతుల కోసం ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయించారు అని మంత్రి తెలిపారు.

తెలంగాణ రైతాంగం దేశానికి అన్నం పెట్టే విధంగా ఎదిగారు. తెలంగాణ సన్న బియ్యం ఎక్కువ పండించి, కంది పంట పెంచండి. రాష్ట్రంలో పండిన పత్తి దేశంలోనే నాణ్యమైనదిగా ఉండటంతో లాభసాటిగా ఉంటుంది. మొక్క జొన్న పంట వేయకండి అని మంత్రి సూచించారు.ప్రపంచంలో ఎత్తైన ఎత్తి పోతల పథకం కాళేశ్వరం కాగా నా కల పాలమూరు రంగారెడ్డి తదితరాలతో నెరవేరనుందని సీఎం కేసీఆర్ అంటారు. రైతు కుటుంబం కష్టాల పాలు కాకుండా రైతు బంధు, ఏటా 1100 కోట్లు రైతు బీమా పథకాలు అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లో 55 కోట్లు ఇవ్వగా, 272 మంది చనిపోయిన రైతులకు12.30 లక్షలు కేవలం కోడంగల్ నియోజకవర్గంలో అందించాం. 385 కోట్ల రూపాయలు ప్రతీ ఏటా వికారాబాద్ జిల్లాలో రైతు బంధు కింద 3.25 లక్షల రైతులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..రైతులు గురించి దేశంలో రైతును రాజుగా చేసే విధంగా ఆలోచించేది సీఎం కేసీఆర్ మాత్రమే,రైతులు ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకోవాలి అన్నారు. లాభసాటి, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు నాటాలి. రైతు సమన్వయ సమితీ గ్రామం, మండలం, జిల్లా సమన్వయ సమితి సభ్యులు రైతులకు సూచనలివ్వాలని ఎమ్మెల్యే. లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించి, వ్యవసాయ పనులు సాగాలి. కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు ఆపదలో రాకుండా 12 కిలో ఉచిత బియ్యం, రూ 1500 అందిస్తున్నాం.బొమ్మరాస్ పేటలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -