విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్..

205
Hyderabad
- Advertisement -

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హుముఖ‌ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్‌ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చేస్తున్నారు. న‌గ‌రం చరిత్రలోనే తొలిసారిగా రూ.30 వేల కోట్లకు పైగా వ్య‌యంతో ప‌లు నిర్మాణ కార్య‌క్ర‌మాలు జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ ముడి ప‌దార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృత‌మైన పురోగ‌తి లభించింది. నగర అభివృద్ధికి తోడు ప్రపంచ దేశాల నుండి ఎన్నోబ‌హుళ‌జాతి కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంప‌లు ప్రణాళికలను రూపొందించింది.

పెరుగుతున్న జనాభాతోపాటు ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లను, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు, కారిడార్లు నిర్మించేందుకు, 54 జంక్షన్లను విస్తరించేందుకు రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి) పనులను చేపట్టింది. అలాగే, హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఇక నుంచి ఐదేండ్ల పాటు రూ.50 వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి)..

400 ఏళ్ల పురాతన చారిత్రక హైదరాబాద్ నగరం అత్యంత రద్దీగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల రహదారులు కలిపి 9204 కిలోమీటర్లకుపైగా ఉన్నాయి. న‌గ‌రాన్ని ట్రాఫిక్ ర‌హితంగా, సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్ద‌డానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.23,000 కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల‌ అభివృద్ధి ప‌థ‌కం(ఎస్‌.ఆర్‌.డి.పి)ని రూపొందించి పనులు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారుల‌పై ఫ్లైఓవ‌ర్లు, కారిడార్లు, అండ‌ర్‌పాస్‌ల నిర్మాణం చేప‌ట్ట‌డం అంత్య‌త క‌ఠిన‌మైన‌ప్ప‌టికీ, వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ, ప్రభుత్వం ఎస్.ఆర్.డి.పి ప‌నుల‌ను అత్యంత వేగ‌వంతంగా నిర్వ‌హిస్తోంది. లాక్ డౌన్ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడాన్ని అదునుగా తీసుకొన్న ప్రభుత్వం రేయింబవళ్లూ పనులు జరిపిస్తుండటంతో చాలావరకు పూర్తయ్యాయి.

నగరంలోని ఎల్.బి.నగర్ వద్ద చింతలకుంట జంక్షన్ అండర్‌పాస్‌, కామినేని ఫ్లైఓవర్‌, ఎల్బీనగర్‌ ఎడమ వైపు ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ అండర్ పాస్, మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్ స్పేస్, బయో డైవర్సిటీ, రాజీవ్ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్ పనులు పూర్తికాగానే, వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఎల్బీనగర్‌ ఎడమ వైపు అండర్‌పాస్‌, బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్ పనులు తుది దశలో ఉన్నాయి. ఎల్బీనగర్‌ కుడివైపు ఫ్లైఓవర్‌ తదితర మిగతా పనులు కొనసాగుతున్నాయి.

ఎస్.ఆర్.డి.పి. పనుల్లో పురోగతి..

  • పురోగతిలో ఉన్న పనుల విలువ – రూ.2,155.64 కోట్లు
  • దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి (రూ.184 కోట్లు) – పనులు తుది దశకు చేరాయి.
  • జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.150 కోట్లు) – తుదిదశకు చేరాయి.
  • షేక్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.333.55 కోట్లు) – జూన్‌ 2021 నాటికి పూర్తిచేసే లక్ష్యం
  • కొత్తగూడ గ్రేడ్‌ సెపరేటర్‌ (రూ.263.09 కోట్లు) – జూన్‌ 2021 నాటికి పూర్తి చేసే లక్ష్యం
  • బాలానగర్‌ గ్రేడ్‌ సెపరేటర్‌ (రూ.387 కోట్లు, హెచ్‌ఎండీఏ )- పనులు జరుగుతున్నాయి.
  • ఒవైసీ హాస్పిటల్‌, బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ (రూ.132 కోట్లు)- పనులు జరుగుతున్నాయి.
  • అంబర్‌పేట్‌ ఛే నెంబర్‌ ఫ్లైఓవర్‌ (రూ.270 కోట్లు, ఎన్‌హెచ్‌ ఆధ్వర్యంలో)- పనులు ప్రారంభం కావాలి.

మంజూరు కావాల్సిన పనులు..

  • ఖాజాగూడ టన్నెల్‌, ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.875 కోట్లు)- పరిపాలనా అనుమతులు రావాలి.
  • ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ (రూ.311కోట్లు)- పరిపాలనా అనుమతులు రావాలి.

మిగతా పనులు..

  • ఇందిరాపార్క్‌- వీఎస్టీ ఎలివేటెడ్‌ కారిడార్‌ (స్టీల్‌ బ్రిడ్జి, రూ.426 కోట్లు)- టెండర్లు పూర్తయ్యాయి.
  • సైబర్‌ టవర్స్‌ ఎలివేటెడ్‌ రోటరీ (రూ.225 కోట్లు)- సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.
  • రేతీబౌలి- నానల్‌నగర్‌ ఫ్లైఓవర్‌ (రూ.175 కోట్లు)- సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.
  • శిల్పాలేఔట్‌- గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ (రూ.330 కోట్లు)- పనులు జరుగుతున్నాయి.
  • నల్లగొండ క్రాస్‌రోడ్స్‌- ఒవైసీ హాస్పిటల్‌ ఎలివేటెడ్‌ కా…
- Advertisement -