రాగల 24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు..

282
Monsoon
- Advertisement -

ఈరోజు దక్షిణ అరేబియా సముద్రం మరియు లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ మరియు మహేలోని చాలా ప్రాంతాలు మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి. నైఋతి రుతుపవనాలు ఈరోజు (జూన్ 1 వ తేదీన) కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశించడం వలన సాధారణ జూన్ 1వ తేదీకే నైఋతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లైనది.

తూర్పు మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండము ఉత్తర దిశగా ప్రయాణించి ఈరోజు (జూన్ 1 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N మరియు Long. 71.4 deg.E వద్ద పాంజిమ్(గోవా)కు నైఋతి దిశగా 360 km,ముంబై(మహారాష్ట్ర )కు దక్షిణ నైఋతి దిశగా 670 km,సూరత్(గుజరాత్)కు దక్షిణ నైఋతి దిశగా 900 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 12 గంటలలో మరింత బలపడి తూర్పు మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉంది.

తదుపరి 24 గంటలలో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో జూన్ 2 వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా జూన్ 3 వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర) మరియు దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు వికారాబాద్,సంగారెడ్డి, మెదక్,సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -