పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సబితారెడ్డి

137
sabirha reddy
- Advertisement -

మీర్‌పేట్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీర్‌పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ కార్పొరేషన్ అధ్యక్షురాలు సిద్రాల లావణ్య,కార్పొరేటర్ లు,అధికారులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

మీర్‌పేట్ వార్డ్ నెంబర్ 1 లో 5 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు,5 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, రెండో వార్డులో10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన,3 వ వార్డులో 5 లక్షలతో గాయత్రి హిల్స్ కమ్యూనిటీ హాల్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 లక్షలతో డ్రైనేజి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు.

అదేవిధంగా18 వ వార్డులో 10 లక్షలతో మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు,19,20 వ వార్డుల్లో 10 లక్షల రూపాయల అంచనా విలువతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసారు. వీటితో పాటు మైత్రిపూరం కాలనీలో 20 లక్షలతో నిర్మిస్తున్న మహిళ మండలి,మరియు వృధ్యాప్య భవన నిర్మాణ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్దే మా ఎజెండా… సమస్యలు లేని కాలనీల కోసం కృషి చేస్తున్నాం. ప్రజల కనీస సౌకర్యాల కల్పనే ద్వేయంగా ముందుకు సాగుతామన్నారు. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. పట్టణాల్లో రోడ్లు,వీధి దీపాలు,డ్రైనేజిలకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ మీర్‌పేట్ దిశ గా అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు.

పట్టణాల నూతన శోభ కోసం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ కృషి చేస్తున్నారు. మీర్‌పేట్ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు కాపాడుకోవాలి..పార్కులు,లైబ్రరీలు,కమ్యూనిటీ హల్ లు,ఆట స్థలాలుగా అభివృద్ధి చేస్తాం.ముందుగా ఖాళీ స్థలాలకు కాపౌండ్ వాల్ లు నిర్మించాలి. కాలనీలలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మెయిన్ రోడ్డులను వెడల్పు చేస్తాం. చెరువుల సుందరికరణ జరుగుతుందని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -