చౌడాపూర్ మండలాన్ని ప్రారంభించిన మంత్రి..

23
Minister sabita reddy

పరిగి నియోజకవర్గమంలో ఏర్పాటు అయిన నూతన చౌడాపూర్ మండలాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మంత్రి చౌడాపూర్ మండల ప్రజలకు అంకితం చేశారు. చౌడాపూర్ మండల ప్రజలు మంత్రి ఘన స్వాగతం పలికారు. చౌడా పూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంతో పాటు,మండల వనరుల కేంద్రం,అంగన్ వాడి కేంద్రం,గ్రామ పంచాయతీ భవనం,వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు.

అనంతరం పరిగి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ కుల్కచెర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. కుల్కచెర్ల మండల కేంద్రంలో 50 లక్షలతో నిర్మించనున్న సహకార పరపతి సంఘం భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, తీర్మాలపూర్ గ్రామంలో ఒక కోటి 55 లక్షల తో నిర్మించనున్న గోదాం నిర్మాణ పనులకు, 80 లక్ష ల తో నిర్మిస్తున్న రైస్ మిల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అంతకు ముందు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పౌసుమి బసు,డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి,డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.