దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందించిన మంత్రి సబితారెడ్డి..

95
Minister Sabita Reddy
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా అర్హులైన వికలాంగ లబ్ధిదారులకు మోటరైజుడ్ ఛార్జింగ్ ట్రై సైకిళ్లను అందజేశారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నియోజకవర్గంలోని అర్హులైన 76 మంది వికలాంగులకు మోటరైజుడ్ ట్రై సైకిల్ అందజేశామని ఇందుకుగాను 42 లక్షలు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి వీరికి అందజేస్తామని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -