‘ఎఫ్ 3’ నుండి వెంకటేష్ బ‌ర్త్‌డే గ్లింప్స్..

171
- Advertisement -

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈ సారి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా,వెంకటేష్ బర్త్ డే సందర్బంగా ఈరోజు ఎఫ్ 3 నుంచి వెంక‌టేష్ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో పాటు బ‌ర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో చార్మినార్ వాతావరణంలో నవాబులా డబ్బుని చేతిలో పట్టుకుని ఊపుతూ హాయిగా కనిపించారు. వెంకటేష్ తన మ్యానరిజంతో అదరగొట్టేశారు.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అవ్వడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి
సంగీత : దేవీ శ్రీ ప్రసాద్
కెమెరామెన్: సాయి శ్రీరామ్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

- Advertisement -