ఖమ్మం అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్క్ ఫెడ్ వైఎస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్‌లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు వ్యవసాయ, మార్క్ ఫేడ్‌కు అనుసంధానం చేశాం. మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల నుంచి కార్గో ద్వారా మార్కెట్ ఫెడ్ గౌడన్లకు తరలిస్తున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాపితంగా 100 కార్గో బస్సులను మొక్కజొన్న తరలింపుకు వాడుతున్నామని.. ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు కార్గో సేవలు వినియోగించుకునేలా చూస్తున్నామన్నారు. ఇక అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాక ఆర్టీసీ సేవల ప్రారంభంపై ఆలోచన చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఆర్టీసీపై నిర్ణయం ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.